తారక్ పోస్టర్ కు ఈ ఫీడ్ బ్యాక్ కూడా వస్తుంది..!

Published on May 20, 2021 6:00 pm IST

నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు సహా సినీ తారలు మరియు పలువురు రాజకీయ నాయకులు కూడా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తించారు. మరి ఇదిలా ఉండగా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మోస్ట్ అవైటెడ్ పోస్టర్ ను “RRR” టీం విడుదల చేశారు. అయితే మంచి ఇంటెన్స్ పోస్టర్ ను డిజైన్ చేసిన దీనికి సూపర్బ్ రెస్పాన్స్ కూడా వచ్చింది.

కానీ అది చూసిన సమయంలోనే దానిపై పెట్టుకున్న అంచనాలకి కొంతమంది తారక్ అభిమానులకు కాస్త నిరాశ కూడా ఎదురయ్యింది. పోస్టర్ బాగానే ఉన్నా ఇంతకు ముందు వచ్చిన పోస్టర్స్ కంటే ఎక్కువే ఆశించడంతో దీనిపై పెదవి విరుస్తున్నారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా ఇది ఉందని కూడా కొందరు అంటున్నారు. దీనితో ఈ మోస్ట్ అవైటెడ్ పోస్టర్ కు ఈ ఫీడ్ బ్యాక్ తప్పలేదు.

సంబంధిత సమాచారం :