టాలీవుడ్ దగ్గర మరో డ్రై సమ్మర్ గా ఈ ఏడాది కూడా నిలిచేలా కనిపిస్తుంది. చిన్న చితకా సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ ఈ ఫ్రైడే మాత్రం కొంచెం చెప్పుకోదగ్గ సినిమాలే వచ్చాయి. ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాలు కూడా ఒకే ఓటీటీ పార్టనర్ తో డీల్ కుదుర్చుకున్నాయి. టాలీవుడ్ నుంచి అడివి శేష్ నటించిన సాలిడ్ సినిమా డెకాయిట్, తమిళ్ నుంచి యువ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చాయి.
అయితే ఈ రెండు సినిమాల ఓటీటీ హక్కులు కూడా పాపులర్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారే సొంతం చేసుకున్నారు. సో థియేటర్స్ లో రన్ తర్వాత అంటే దాదాపు మరో నెల తర్వాత ఈ రెండు సినిమాలు ఇదే ఓటీటీలో సందడి చేసే అవకాశం ఉంది. డెకాయిట్ సినిమాని శానియల్ డియో దర్శకత్వం వహించగా లైక్ ని విగ్నేష్ శివన్ తెరకెక్కించారు.
