ఈ శుక్రవారం చిన్న సినిమాలదే రాజ్యం.

ఈ శుక్రవారం చిన్న సినిమాలదే రాజ్యం.

Published on Sep 3, 2014 1:42 PM IST

kiraak_Weekend-Love11
ఈ శుక్రవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మూడు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రవితేజ ‘పవర్’ ఒక వారం వెనక్కు వెళ్ళడంతో ఆ గ్యాప్’ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. శివాజీ నటించిన ‘బూచమ్మ బూచోడు’, ఫిల్మ్ జర్నలిస్ట్‌ నాగు గవర దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘వీకెండ్ లవ్’, ‘కిరాక్’ సినిమాలు సెప్టెంబర్ 5, ఈ శుక్రవారం విడుదలవుతున్నాయి. వీటిలో ఏ సినిమా విజయం సాదిస్తుందో వేచి చూడాలి.

ఎన్టీఆర్ ‘రభస’తో మొదలైన బడా సినిమాల రాక.. సెప్టెంబర్ నెల అంతా కొనసాగుతుందని విశ్లేషకులు భావించారు. మహేష్ బాబు, రవితేజ, గోపీచంద్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలు ఈ నెలలోనే తమ సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. విడుదల తేదీలను కూడా ప్రకటించేశారు. మొదట ‘పవర్’, ‘ఒక లైలా కోసం’ సినిమాలు సెప్టెంబర్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. చివరి నిముషంలో విడుదల వాయిదా పడడంతో ఈ శుక్రవారం థియేటర్ల వద్ద సందడి లేకుండా పోయింది.

తాజా వార్తలు