పవన్ సినిమాలో ఈ గ్లామరస్ యాంకర్ కూడా.?

Published on Jan 20, 2021 3:00 pm IST

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను రీఎంట్రీ ఇచ్చిన చిత్రం “వకీల్ సాబ్” షూట్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా స్టార్ట్ చేసి మొదట్లోనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను కూడా దర్శకుడు క్రిష్ తో పవన్ మొదలు పెట్టేసారు. భారీ బడ్జెట్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి.

పవన్ తో ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రమే కాకుండా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది అని తెలుస్తుంది. మరి లేటెస్ట్ గా ఈ సినిమాపై మరో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో గ్లామరస్ యాంకర్ మరియు ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ కూడా ఒక ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :