యంగ్ టైగర్ నెక్స్ట్ కు ఈ హ్యాపెనింగ్ హీరోయిన్.?

Published on May 12, 2021 5:05 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత కూడా కొన్ని సాలిడ్ ప్రాజెక్ట్స్ తారక్ తన లైన్ లో పెట్టుకున్నాడు. వాటిలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో చేసే సినిమా ఒకటి. “RRR” అనంతరమే ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ మొదలు కానుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి మరో లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో తారక్ సరసన మన తెలుగు మరియు బాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే తారక్ అభిమానులు రాజమౌళి సినిమా నుంచి రానున్న భీం కొత్త పోస్టర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :