టాక్..మహేష్ – త్రివి సినిమాలో ఈమెని తప్పించి ఆమెని?

Published on Jun 3, 2022 4:00 pm IST


ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ చిత్రం “సర్కారు వారి పాట” రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్లతో తీసిన ఈ సినిమా హిట్ తో మహేష్ ఇప్పుడు వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇక ఈ సినిమా అనంతరం అభిమానుల్లో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న కాంబో త్రివిక్రమ్ తో రిపీట్ కాబోతుంది.

అయితే ఈసారి వీరి నుంచి పాన్ ఇండియా లెవెల్ ట్రీట్ అనౌన్స్ అవ్వడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ పై త్రివిక్రమ్ టేకింగ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చూసాం అందుకే అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ని అనుకున్నట్టు తెలియగ ఇప్పుడు ఈమె తప్పుకున్నట్టు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు అయితే ఆమె స్థానంలో యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ సెట్ అయ్యినట్టు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి వీటిపై అయితే ఇంకా ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. అయితే ఏది అన్నది మాత్రం అధికారిక క్లారిటీ వస్తే గాని చెప్పలేం. ప్రస్తుతానికి అయితే ఈ రూమర్స్ లో నిజం లేదనే మాట వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :