టాలీవుడ్ లో ఈ హిందీ హీరోయిన్ డ్రీం ఇదేనట.!

Published on Mar 31, 2021 9:00 am IST

కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాలొమోన్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రం “వైల్డ్ డాగ్”. ఇండియాలోనే అతి పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ చిత్రం ఈ వారం విడుదల కానుంది. మరి ఈ చిత్రం విడుదల సందర్భంగా ఇందులో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ నటి దియా మీర్జా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ సినిమాకు మొదట నార్మల్ అప్రోచ్ జరిగిందని కానీ తర్వాత దర్శకుడు కథ చెప్పడం అలాగే ఇందులో నాగ్ నటిస్తుంన్నారని తెలియడంతో నిర్మొహమాటంగా ఓకే చెప్పేసానని చెప్పింది. అంతే కాకుండా తన తల్లి మరియు నాగ్ సర్ సోదరి క్లోజ్ ఫ్రెండ్స్ అని అలా తమకి మొదటి నుంచి పరిచయం ఉందని ఆమె తెలిపింది.

మరి ఇదిలా ఉండగా తెలుగులో అయితే కింగ్ నాగార్జునతో పాటుగా విక్టరీ వెంకటేష్ తో సినిమాలు చేయాలన్నది ఎప్పటి నుంచో తనకు ఉన్న డ్రీం అని అందులో వైల్డ్ డాగ్ తో ఇప్పుడు సగం తీరగా మిగతా సగం రాబోయే రోజుల్లో తీరుతుందని కోరుకుంటున్నాని తెలిపింది.

సంబంధిత సమాచారం :