“వీరమల్లు”లో రాకుమారిగా ఈ హాట్ బ్యూటీ.!

Published on May 15, 2021 6:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “హరి హర వీరమల్లు” కూడా ఒకటి. భారీ పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కుతున్న దీనిపై సాలిడ్ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్ గా యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రంలో మరో హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆమె రోల్ పై ఓ క్లారిటీ ఇచ్చినట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఈ చిత్రం ఓ రాకుమారి పాత్రలో కనిపిస్తానని చెప్పుకొచ్చిందట. అలాగే పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి కూడా బాగా ఎగ్జైట్ అవుతున్నట్టు తెలిపింది. అలాగే ప్రస్తుత కోవిడ్ సిచుయేషన్ సర్దుమణిగాక ఈ చిత్రం తాలూకా షూట్ మొదలు పెట్టనున్నారని మరో క్లారిటీ కూడా ఇచ్చింది. మరి జాక్వలిన్ ఇది వరకే ప్రభాస్ “సాహో” లో హాట్ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :