ప్రభాస్ “సలార్” లో ఈ హాట్ బ్యూటీ కూడా..?

Published on Jul 3, 2021 6:22 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో మొదటి సినిమా కావడంతో దీనిపై అనేక అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇప్పటికి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ షూట్ కి సన్నద్ధం అవుతుంది. అలాగే ఈ సినిమా క్యాస్ట్ పరంగా అయితే ఒక్క ప్రభాస్, శృతి హాసన్ మినహా మిగతా కీలక నటుల విషయంలో మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కానీ పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో ఉన్నారని టాక్ మాత్రం ఉంది.

అలా ఈ చిత్రంలో కీలక పాత్రకు గాను బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణి కపూర్ ను ఎంపిక చేసినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి. ఇది వరకే మరో హాట్ బ్యూటీ దిశా పటాని పేరు కూడా సలార్ విషయంలో వినిపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :