“కేజీయఫ్ 2” రిలీజ్ డేట్ పై అక్కడ మాటేంటి అంటే.?

Published on Jun 19, 2021 2:00 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టి కాంబినేషన్ లో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం కేజీయఫ్ భారీ హిట్ కావడంతో చాప్టర్ 2 పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా మరోపక్క కరోనా దెబ్బకు జరగాల్సిన నష్టం కూడా సినీ పరిశ్రమకు మరియు మూవీ లవర్స్ కి జరిగిపోయింది. మనశ్శాంతిగా థియేటర్స్ లో మళ్ళీ సినిమాలు చూసే రోజు ఎప్పుడు వస్తుందా అన్న ప్రశ్న ఇంకా ఉంది.

మామూలు సినిమాలు అంటే ఏమో కానీ దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న కేజీయఫ్ లాంటి సినిమాలు పరిస్థితి మరింత ప్రశ్నర్థకంగా మారాయి. అయితే ఈ సినిమా విషయంలో ముఖ్యంగా చాలానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకు ఎంతో కీలకమైన ప్రధాన మార్కెట్ బాలీవుడ్ వర్గాలు ఈ సినిమా విడుదల తేదీపై కొన్ని టాక్స్ చెబుతున్నాయి.

నిజానికి అయితే కేజీయఫ్ యూనిట్ తాము మొదట చెప్పిన ఒరిజినల్ రిలీజ్ డేట్ జూలై 16కే ఇంకా స్టిక్ అయ్యి ఉన్నారట మరి ఆనాటికి పైగా థియేట్రికల్ మార్కెట్ అంతా 100 శాతం ఆక్యుపెన్సీ ఉంటే ఆ డేట్ కి విడుదల చేస్తారట అలాగే అది మిస్సయితే ఆగస్ట్ 15కి విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :