బన్నీ కోసం కథ రెడీ చేస్తున్న మరో ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్.?

Published on Jun 9, 2021 10:01 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. ఈ చిత్రంతో గ్రాండ్ గా పాన్ ఇండియన్ ఎంట్రీ ఇస్తున్న స్టైలిష్ స్టార్ అక్కడ నుంచి ఐకాన్ స్టార్ గా మారనున్నాడు. ఇక దీని తర్వాత కూడా బన్నీ మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు సెట్ చేసుకుంటున్నాడు. అయితే బన్నీ కోసం ఓ స్టార్ అండ్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్ కథ సిద్ధం చేస్తునట్టుగా టాక్ ఇపుడు వినిపిస్తుంది.

అతడు మరెవరో కాదు “మనం”, “24” లాంటి మాస్టర్ పీస్ సినిమాలు ఇండియన్ సినిమా దగ్గర ఇచ్చిన ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ విక్రమ్ కె కుమార్. తాను బన్నీ కోసం ఒక సాలిడ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ప్రస్తుతానికి ఇంకా స్క్రిప్ట్ పనిలోనే ఉన్నారని తెలుస్తుంది. మరి ఈ క్రేజీ కాంబోలో సినిమా ఎప్పుడు మొదలు కానుందో అసలు ఎలాంటి సినిమా స్టార్ట్ కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :