టబు ఫ్యాన్స్ కు ఇది కొంచెం ఇబ్బందే !

Published on Apr 28, 2019 6:28 pm IST

ఒకప్పటి టాప్ హీరోయిన్స్ ను తన సినిమాల్లో తల్లి లేదా అత్త క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు త్రివిక్రమ్. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబును చూపించబోతున్న సంగతి తెలిసిందే. అసలు ఇంతకీ టబు అంటేనే ఇప్పటికీ కుర్రకారులో హీరోయిన్ రూపమే ప్రత్యక్షమవుతుంది. మరి అలాంటి హీరోయిన్ని తమ అభిమాన కథానాయకుడికి తల్లిగా చూస్తారా.. ? త్రివిక్రమ్ కాబట్టి రెండు బలమైన్ సీన్స్ తో నాలుగు లోతైన డైలాగ్ లతో తల్లిగా ఒప్పించేస్తాడు. అయినప్పటికీ టబును ఇంకా హీరోయిన్ గానే చూడాలనుకుంటున్న ప్రేక్షకులకు మాత్రం ఇది కొంచెం ఇబ్బందే.

తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా ఈ సినిమా అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సుశాంత్, నవదీప్ లు కూడా నటిస్తున్నారు. అలాగే మరో కీలక పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :