రెండున్న‌రేళ్ల క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది !

Published on Jun 20, 2019 12:00 am IST

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుని యు/ఏ స‌ర్టిఫికేట్‌ ను తెచ్చింది. స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శకుడు. రాహుల్ యాద‌వ్ న‌క్కా నిర్మాత‌. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి తేజ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా… న‌వీన్ పొలిశెట్టి మాట్లాడుతూ – “మేం ట్రైల‌ర్ విడుద‌ల చేసిన‌ప్పుడు మాకు ట్విట్ట‌ర్ ద్వారా ఏ సెల‌బ్రిటీ స‌పోర్ట్ చేస్తారా ? అని ఎదురుచూస్తున్న త‌రుణంలో సాయితేజ్ మా ట్రైల‌ర్‌ను షేర్ చేయ‌డం ద్వారా ఎంతో హెల్ప్ చేశాడు. త‌న‌కు ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెబుతున్నాను. అలాగే డైరెక్ట‌ర్ స్వ‌రూప్‌ కి స్పెష‌ల్ థాంక్స్‌. ఆయ‌న క‌థ‌ను సిద్ధం చేసుకున్న త‌ర్వాత ఎంద‌రో హీరోలు ముందుకు వ‌చ్చినా, నాతోనే సినిమా చేయాల‌ని వెయిట్ చేశారు. మా అంద‌రినీ 720 పిక్స‌ల్ వీడియో నుండి 70 ఎం.ఎం స్క్రీన్ వ‌ర‌కు తీసుకు వ‌చ్చిన అంద‌రికీ థాంక్స్‌. సినిమా హీరో కావాల‌నేది నా డ్రీమ్‌. ఆ క‌ల నేర‌వేరింది. రెండున్న‌రేళ్ల క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. 21న ఈ సినిమా విడుద‌ల కానుంది. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దించాల‌ని.. హిలేరియ‌స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ గా సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని చెప్ప‌గ‌ల‌ను“ అన్నారు.

ఇక న‌వీన్ ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్ర‌ధారిగా న‌టించారు. సినిమా ఆసాంతం ఎంట‌ర్‌ టైనింగ్‌ గా ఉంటుందట. మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

సంబంధిత సమాచారం :

X
More