బన్నీ నటన నిజంగా స్ఫూర్తిదాయకం – సమంత

Published on Dec 20, 2021 1:03 am IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన సినిమా ‘పుష్ప- ది రైజ్’. అయితే, ఈ సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. బన్నీ నటన చూసి సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. తాజాగా సమంత కూడా పుష్పలో బన్నీ నటన చూసి థ్రిల్ అయిపోయింది.

ఈ సందర్భంగా సమంత ఒక మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ‘ఇది అల్లు అర్జున్ పై ప్రశంసల పోస్ట్ !!. పుష్ప లో అల్లు అర్జున్ ప్రతి సెకను మిమ్మల్ని కట్టిపడేసే ప్రదర్శన చేశాడు. ఒక నటుడు అసాధారణమైన ప్రదర్శనతో గొప్ప నటన కనబరిస్తే.. ఆ నటన నుంచి నేను ఎప్పుడూ స్ఫూర్తిని పొందుతాను. బన్నీ నటన ఖచ్చితంగా అద్భుతమైనది.. నిజంగా స్ఫూర్తిదాయకం’ అంటూ సమంత ఒక మెసేజ్ ను పోస్ట్ చేసింది.

ఇక ఈ సినిమాలో సమంత చేసిన ప్రత్యేక గీతం ప్రేక్షకులను బాగా అలరించింది. కాగా ఈ సాంగ్ గురించి చెప్పగానే సమంత నాకు కరెక్ట్‌ కాదని రిజెక్ట్ చేసి.. మళ్ళీ తర్వాత చేయడానికి అంగీకరించిందట. ఇక గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చిన పుష్ప మార్నింగ్ షో నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదు చేస్తోంది.

సంబంధిత సమాచారం :