10 మిలియన్ ఫాలోవర్స్ పై మహేష్ స్పందన ఇదే..!

10 మిలియన్ ఫాలోవర్స్ పై మహేష్ స్పందన ఇదే..!

Published on Jul 3, 2020 5:31 PM IST

టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్స్ కి చేరిన సంగతి తెలిసిందే. సౌత్ ఇండియాలోనే ఆ ఘనత సాధించిన మొదటి హీరోగా మహేష్ రికార్డులకు ఎక్కాడు. సౌత్ ఇండియాలో మరే హీరోకు కూడా 10 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ లేకపోవడం విశేషం. కాగా అభిమానులు తన పట్ల చూపిన ఆ అభిమానానికి మహేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనను అంతగా అభిమానిస్తున్న ఫ్యాన్స్ ప్రేమకి కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన ఆనందం తెలియజేశారు.

ఇక మహేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు పరుశురాం తో చేస్తున్నారు . సర్కారు వారి పాట టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు