పవన్ మిస్సవ్వడానికి కారణం ఇదే.!

Published on Aug 15, 2020 12:39 am IST


ఇప్పుడు మన టాలీవుడ్ లో పెళ్లిళ్ల సందడి మొదలయ్యింది. ఎందరో అగ్రతారల వివాహ వేడుకలు ఈ సమయంలోనే చాలా సింపుల్ గా జరిగిపోతున్నాయి.అలా తాజాగా మెగా డాటర్ నిహారిక నిశ్చయ వేడుకలు జరగడంతో మెగా కుటుంబం అంతా ఆ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అంతా అటెండ్ అయ్యారు కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు దీనితో ఈ అంశం మరోసారి పవన్ అభిమానులు సహా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉండగా అసలు పవన్ ఎందుకు ఈ శుభ కార్యానికి అటెండ్ కాలేదో కారణం తెలుస్తుంది.

పవన్ ప్రస్తుతం చాతుర్మాస దీక్ష చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ దీక్ష ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రాకూడదట అందుకే పవన్ ఈ ఫంక్షన్ కు అటెండ్ కాలేకపోయారు. ఇటీవలే నితిన్ పెళ్ళికి హాజరు అయినప్పుడు కూడా మధ్యాహ్న ఫంక్షన్ కే హాజరు అయ్యారు. దీనితో ఇదే పవన్ ఈ ఫంక్షన్ లో మిస్సవ్వడానికి కారణం అని సమాచారం.

సంబంధిత సమాచారం :

More