రికార్డ్ స్థాయిలో “మా” ఓటింగ్..ఈ ఎన్నికల హిస్టరీలోనే అట!

Published on Oct 10, 2021 3:41 pm IST

ఈరోజు టాలీవుడ్ లో ఎప్పుడు నుంచో ఎంతో రసవత్తరంగా, ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి మా ఎన్నికలు(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అట్టహాసంగా ఈరోజు తెల్లవారు జాము నుంచి బంజారా హిల్స్ లో మొదలు అయ్యాయి. మరి పొద్దున్న నుంచే రెండు ప్యానల్ సభ్యులతో కిక్కిరిసిన ప్రాంగణం తర్వాత పలువురు స్టార్ హీరోలు రాకతో మరింత గ్రాండ్ గా తయారయ్యింది.

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు జరిగాయి అని మొదటి నుంచి టాక్ ఉండగా అది ఓట్స్ రూపేణా అక్షర సత్యం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు రికార్డు స్థాయి వోటింగ్ కంప్లీట్ చేసుకుందట. ఇప్పటి వరకు మొత్తం 665 ఓట్లు పోల్ అయ్యాయట.

ఈ ఎన్నికల్లో మొత్తం వాలిడ్ ఓట్స్ 883 ఉండగా ఏకంగా 665 ఓట్లు కౌంట్ అయ్యాయి. అందులో 60 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. దీనితో ఇప్పుడు వరకు 72 శాతం ఓటింగ్ పోల్ అవ్వడం రికార్డు అని తెలుస్తుంది. ఇది గతంలో ఎప్పుడూ కూడా నమోదు కానీ అత్యధిక శాతం అట. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత ఈ పోలింగ్ లెక్కింపు స్టార్ట్ కానుండగా తర్వాత మంచు విష్ణు ప్యానల్ నెగ్గిందా? ప్రకాష్ రాజ్ ప్యానల్ నెగ్గిందా అన్నది తెలియనుంది.


గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సెట్ – 1 |సెట్ – 2 | సెట్ – 3

సంబంధిత సమాచారం :