లాక్ డౌన్ లో మహేష్ టైం టేబుల్ ఇదే..!

Published on Apr 5, 2020 10:38 am IST

కరోనా వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. ఇక సెలెబ్రిటీలు సామాజిక బాధ్యతగా ఇంటికే పరిమితం అవుతున్నారు. కాగా హీరో మహేష్ క్వారంటైన్ టైంలో ఇంటిలో చేస్తున్న పనులను ఆయన సతీమణి నమ్రత చెప్పుకొచ్చారు. షూటింగ్స్ సమయంలో ఆయనకు పిల్లలతో గడిపే సమయం దొరకదు. ఈ కరోనా కారణంగా మహేష్ కి పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కింది. ప్రస్తుతం మహేష్ పిల్లలు సితార, గౌతమ్ లతో గేమ్స్ ఆడుకుంటున్నారు. అలాగే అన్ని పరిశ్రమలకు చెందిన కొత్త చిత్రాలు, సిరీస్ లు చూస్తున్నారు. దానితో పాటు ఆయన ఇష్టమైన పుస్తకాలు చదువుతున్నారు అని నమ్రత చెప్పుకొచ్చారు.

ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ ఇంకా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. ఆయన కొత్త దర్శకుల నుండి కథలు వింటున్నాడని తెలుస్తుంది. మహేష్ నిజానికి వంశీ పైడిపల్లితో మూవీ చేయాల్సివుండగా, కారణం ఏదైనా అది హోల్డ్ లో పడింది. ఫ్యాన్స్ ఆయన కొత్త చిత్ర ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More