సూపర్ స్టార్ సినిమాలో ఆమె తీసుకోవడం వెనుక కారణం అదేనా…?

Published on Dec 5, 2019 7:55 am IST

రజిని కాంత్ వయసుపెరిగే కొద్దీ ఆశ్చర్యంగా సినిమాల స్పీడు పెంచుతున్నాడు. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన దర్బార్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. కొద్దిరోజుల క్రితం రజిని ఈ చిత్రం కోసం డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. మురుగ దాస్ డైరెక్షన్ లో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. కాగా ఈమూవీ చిత్రీకరణ టైంలోనే రజిని తన 168వ చిత్రాన్ని ప్రకటించారు. మాస్ చిత్రాల దర్శకుడిగా పేరున్న శివ డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

ఐతే ఈ చిత్రంలో మీనాను ఓ పాత్ర కొరకు తీసుకుంటున్నారని తెలుస్తుంది . ఆమెను తీసుకోవడం వెనుక అసలు కారణంగా కూడా ఈ మధ్య రజిని వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. ఈ తరుణంలో మీనా ను రజిని కి హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది. మరో వైపు ఆమెది నెగెటివ్ రోల్ ఐయ్యే అవకాశం కూడా కలదని మరో వార్త. ఇక గతంలో రజిని మీనా కలిసి అనేక చిత్రాలతో జంటగా నటించారు. వీరు నటించిన ముత్తు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నెలాఖరులో లేదా జనవరిలో ఈమూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. సన్ నెట్ వర్క్స్ రజిని-శివ ల చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల మీనా కరోలినా కామాక్షి అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More