వరల్డ్ చెస్ ఛాంపియన్ వర్సెస్ కన్నడ స్టార్ హీరో.!

Published on Jun 13, 2021 3:50 pm IST

ఇప్పుడు మన దక్షిణాదికి చెందిన మరో భారీ చిత్ర పరిశ్రమ శాండల్ వుడ్ స్టార్ హీరోస్ లో కిచ్చా సుదీప్ కూడా ఒకరు. ఒక్క కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా సాలిడ్ చిత్రాలను కిచ్చా చేశారు. మరి అక్కడ అపారమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో మన దేశానికి చెందిన ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తో ఒక మ్యాచ్ ఈరోజు ఆడనున్నారట.

అలాగే ఈ చెస్ గేమ్ వీరిద్దరి నడుమ ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సాగనుంది. అయితే ఈ వినూత్న ప్రయత్నం ఎందుకో కూడా తెలుస్తుంది. ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ ను సేకరించి కరోనా కష్ట కాలంలో సాయం చేసేందుకు భారత్ చెస్ వారు ప్లాన్ చేశారట. మరి ఈ ఇంట్రెస్టింగ్ గేమ్ యూట్యూబ్ లో వారి చెస్ కామ్ ఛానల్ లో లైవ్ గా స్ట్రీమ్ చెయ్యొచ్చని తెలిపారు. మరి ఈ స్టార్ హీరో కిచ్చా వర్సెస్ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ మ్యాచ్ ఎలా ఉండనుందో ఎవరు గెలుస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :