టాక్..నాని నెక్స్ట్ లో తమిళ యంగ్ హీరోయిన్?

Published on Sep 30, 2023 8:01 am IST


నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 30 వ సినిమా “హాయ్ నాన్న” లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని యంగ్ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తూ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాని తన కెరీర్ లో 31వ సినిమాని దర్శకుడు వివేక్ ఆత్రేయ తో చేయనున్న సంగతి తెలిసిందే. తనతో ఆల్రెడీ చేసిన “అంటే సుందరానికీ!” చిత్రానికి మంచి మార్కులు కూడా వచ్చాయి.

దీనితో రెండో సినిమా కోసం అందరిలో మంచి అసతి నెలకొనగా ఈ చిత్రంని అయితే దర్శకుడు సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అయితే తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ చిత్రంలో అయితే హీరోయిన్ గా ఎవరు చేస్తారు అనేది ఇన్ని రోజులు ఆసక్తిగా మారగా ఫైనల్ గా అయితే ఇప్పుడు తమిళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ లాక్ అయ్యింది అని తెలుస్తుంది. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ పెయిర్ ఫిక్స్ అయ్యింది అని చెప్పాలి. అలాగే దీనిపై అధికారిక క్లారిటీ రానున్న రోజుల్లో రానుంది.

సంబంధిత సమాచారం :