“ధృవ నక్షత్రం” పై మాస్ డైరెక్టర్ ఫస్ట్ రివ్యూ.!

Published on Nov 21, 2023 4:30 pm IST

కోలీవుడ్ విలక్షణ హీరో విక్రమ్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ధృవ నక్షత్రం”. అయితే ఎప్పటి నుంచో ఆలస్యం అవుతూ వస్తున్న ఈ చిత్రం ఫైనల్ గా ఈ నవంబర్ లో రాబోతుంది.

అయితే మరీ అంత హై బజ్ ఈ సినిమాపై నెలకొనలేదు కానీ డీసెంట్ రిలీజ్ తో తెలుగు సహా తమిళ్ లో ఈ చిత్రం రాబోతుంది. మరి ఈ చిత్రంపై అయితే కోలీవుడ్ మాస్ దర్శకుడు ఎన్ లింగుసామి తన ఫస్ట్ రివ్యూ అయితే ఇవ్వడం వైరల్ గా మారింది. తాను సినిమా ఫైనల్ కట్ చూశానని సినిమా ఫెంటాస్టిక్ గా ఉంది చాలా బాగా తీసారని విజువల్స్ కూడా బెస్ట్ గా ఉన్నాయని తెలిపారు.

విక్రమ్ సినిమాలో చాలా కూల్ గా ఉండగా నటుడు వినాయకన్ తనదైన నటనతో మనసు గెలుచుకున్నాడు. గౌతమ్ మీనన్ కి కంగ్రాట్స్ చెప్తూ సంగీత దర్శకుడు హరీష్ జై రాజ్ పై మళ్ళీ మీ కాంబో నుంచి ఓ జెమ్ వస్తుంది అని లింగుసామి సాలిడ్ రివ్యూ అందించారు. దీనితో ఈ పిష్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :