రజినీ “కూలీ” ఓటిటి డీల్ కి భారీ ధర?

రజినీ “కూలీ” ఓటిటి డీల్ కి భారీ ధర?

Published on Mar 15, 2025 8:00 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెలుగు సహా తమిళ్, కన్నడ, హింది నుంచి బిగ్ స్టార్స్ కలయికలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కూలీ” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇక మేకర్స్ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని కూడా అందిస్తుండగా లేటెస్ట్ గా కూలీ ఓటిటి డీల్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ సినిమాకి ఇపుడు ఓ ప్రముఖ ఓటిటి సంస్థ నుంచి ఏకంగా 120 కోట్లు ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు కూలీ ఓటిటి డీల్ ని రజినీకాంత్ లాస్ట్ సెన్సేషనల్ హిట్ జైలర్ ని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వారే సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు