మహేష్, త్రివిక్రమ్ ల సినిమాలో ఈ ప్రముఖ హీరో కూడా.?

Published on May 14, 2021 10:00 pm IST

ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రానున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ కాంబోస్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు సూపర్ స్టార్ మహేష్ ల నుంచి వస్తున్న హ్యాట్రిక్ కాంబో కూడా ఒకటి. ఇటీవల అనౌన్స్ కాబడిన ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి త్రివిక్రమ్ సినిమాలు అంటే క్యాస్టింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే.

ప్రధాన పాత్రదారులతో పాటుగా ఇతర కీలక పాత్రలకు గాను త్రివిక్రమ్ పలువురు ప్రముఖ నటులనే తీసుకుంటారు. మరి అలా ఈ చిత్రానికి కూడా ఓ ప్రముఖ హీరోను అనుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అతడు మరెవరో కాదు హీరో సుమంత్.

మళ్ళీ రావా, సుబ్రహ్మణ్యపురం చిత్రాలతో మంచి కం బ్యాక్ ఇచ్చిన ఈ హీరో ఈ చిత్రంలో కీలక పాత్ర చేయనున్నాడని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇది వరకే అల వైకుంఠపురములో చిత్రానికి అక్కినేని కుటుంబం నుంచి సుశాంత్ తో ఓ కీలక పాత్ర త్రివిక్రమ్ చేయించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :