“రాధే శ్యామ్”లో ఈ పార్ట్ అనుకున్న దానికంటే ఎక్కువే.?

Published on May 6, 2021 9:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. అద్భుతమైన పీరియాడిక్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం షూట్ అంతా అయ్యిపోయినప్పటికీ మళ్ళీ రీషూట్స్ మూలాన దర్శకుడు రాధా కృష్ణ మళ్ళీ కొంత రీషూట్ స్టార్ట్ చెయ్యాల్సి వచ్చింది.

కానీ ఈ రీషూట్ మాత్రమే కాకుండా గ్రాఫికల్ వర్క్ పరంగా కూడా ఈ చిత్రంలో చాలానే బ్యాలన్స్ ఉందట. పైగా ఈ గ్రాఫికల్ వర్క్ మొదట అనుకున్న దానికంటే కూడా ఇప్పుడు కాస్త ఎక్కువయిందని టాక్ వినిపిస్తుంది. ఇలాంటి పీరియాడిక్ సినిమాలు అంటే వి ఎఫ్ ఎక్స్ వర్క్ చాలా మేర తప్పనిసరి.

అందుకే ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. అందుకే ఈ సినిమా షూట్ కోసం అధునాతన టెక్నాలజీని కూడా వినియోగించారు. మరి విజువల్ గా ఈ చిత్రం ఎలాంటి ట్రీట్ ఇస్తుందో ఇప్పుడు చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి ముగ్గురు సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :