ఈ పాపులర్ కంటెస్టెంట్ “బిగ్ బాస్” నుంచి ఎలిమినేటడ్.?

ఈ పాపులర్ కంటెస్టెంట్ “బిగ్ బాస్” నుంచి ఎలిమినేటడ్.?

Published on Nov 22, 2020 12:05 PM IST

BiggBoss4 1

ఇప్పుడు బిగ్ బాస్ షో అంతిమ దశకు చేరుకుంటుండే సరికి మరింత గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది అని చెప్పాలి. ఒక్కో కంటెస్టెంట్ తగ్గుతుంటే ఆడియెన్స్ లో మరింత ఆసక్తి నెలకొంటుంది. అలా ఇప్పుడు మిగిలి ఉన్న ఎనిమిది కంటెస్టెంట్స్ లో ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా వారిలో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారని ఇది వరకే తెలిపాము. అయితే ఈ వారాంతం ఎవరు ఎలిమినేట్ అయ్యారో అన్నది.

ఇప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారందరిలో తెలుగు ఆడియెన్స్ కు బాగా తెలిసిన వారిలో లాస్య ఒకరు. ఇపుడు ఈమెనే బిగ్ బాస్ హౌస్ నుంచి వైదొలగనున్నట్టు టాక్. ఈమెతో పాటుగా మోనాల్ గజ్జర్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ లాస్యకు అనుకున్న దాని కంటే తక్కువ ఇంపాక్ట్ కలిగించే వోటింగ్ నమోదు కాకపోవడం వల్ల ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యినట్టుగా సమాచారం. మరి నిజంగా లాస్య ఎలిమినేట్ అయిందో లేదో ఈరోజు ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు