పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే, పవన్ కళ్యాణ్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను టాప్ ప్రొడ్యూసర్ రిజిస్టర్ చేయించినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గతంలో పవన్‌తో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేసేందుకు ఈ నిర్మాత ప్రయత్నిస్తున్నారట. దీనికోసం ‘అర్జున’ అనే ఓ పవర్ఫుల్ టైటిల్‌ను ఆయన రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ సినిమాను ఎవరితో డైరెక్ట్ చేయిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఓకే చెబుతాడా అనేది వేచి చూడాలి.


