ఈ విధంగా విజయ్ కే సాధ్యం ఏమో.!

Published on Aug 12, 2020 9:32 am IST

మన దగ్గర స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ లు ఎలాగో కోలీవుడ్ లో కూడా థలపతి విజయ్ మరియు థలా అజిత్ కూడా అంతే అని చెప్పాలి. ఈ నలుగురికి రిలేటెడ్ గా చాలా అంశాలే వారి అభిమానులకు నచ్చుతాయి. ఏ అంశంలో అయినా సరే రికార్డుల పరంగా వీరెప్పుడు పోటా పోటీ గానే ఉంటారు. కానీ తమిళ్ స్టార్ హీరో విజయ్ క్రేజ్ ఎందుకో తన అభిమానుల మూలాన వేరే లెవెల్లో ఉంటుంది.

అది తన సినిమాల యూట్యూబ్ లైక్స్ పరంగా కానీ పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండనప్పటికీ తాను ఒక ట్వీట్ చేస్తే వచ్చే రీచ్ అంతా ఇంతా కాదు. లేటెస్ట్ గా మహేష్ కోసం చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేసి పెట్టిన ట్వీట్ కు కేవలం ఒక్క గంటలోనే లక్ష లైకులు నాలుగు గంటల్లో 2 లక్షల లైకులు వచ్చేసాయి.

కేవలం ఇవనే కాకుండా తన సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను కూడా విజయ్ తన ట్విట్టర్ నుంచే విడుదల చేసినపుడు ఇంతే స్థాయి రెస్పాన్స్ వస్తుంది. ఇలా ప్రతీ పోస్టుకు అందులోను కేవలం 2 మిలియన్ మందికి పైగా మాత్రమే ఫాలోవర్స్ ఉన్న హ్యాండిల్ నుంచి రావడం విజయ్ కే సాధ్యపడింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More