“వకీల్ సాబ్”లో సర్ప్రైజ్ ఏమో కానీ ఈ సీన్ గట్టిగా వైరల్ అవుతుంది!

Published on Apr 12, 2021 12:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు ముందు వరకు ఎలాంటి టాక్ లో ఉండేదో తెలిసిందే. రీమేక్ సినిమా అని పవన్ ఉంటే బాగున్ను అని పవన్ అభిమానులే అభిప్రాయం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

సరే ఇదిలా ఉండగా శ్రీరామ్ మాత్రం వకీల్ సాబ్ ను రీమేక్ చేసిన విధానం చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అలా చేసిన మార్పులు చేర్పులలోనే ఈ చిత్రం సెకండాఫ్ లో ఓ సర్ప్రైజ్ ఉందని ఆ మధ్య మేకర్స్ టీజ్ చేసిన సంగతి తెలిసిందే. అదేమిటా అన్నది ఇంకా సినిమా చూసిన వారికి ఎవరికీ అర్ధం కాలేదు కానీ ఇదే సెకండాఫ్ లో ఓ సన్నివేశం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

పవన్ కోర్ట్ రూమ్ లో మహిళా పోలీస్ గా కనిపించిన నటి లిరిషాతో నడిచే సీన్ లో “సూపర్ విమెన్” అంటూ పవన్ తన మార్క్ నటనలో ఇంటరాగేట్ చెయ్యడం అందులో ఆమె జెట్ స్పీడ్ లో వచ్చేసా అని చెప్పడం వంటివి ఆ సందర్భంలో ఓ రేంజ్ లో పేలాయి. ఓ పక్క నిజం ఆసక్తిగా బయటకు వస్తూనే మరో కోణంలో ఫన్నీగా కూడా ఈ సీన్ ఉండడంతో ఓ రేంజ్ ఇప్పుడు హిట్ అయ్యింది. కానీ మొత్తానికి మాత్రం వకీల్ సాబ్ సెకండాఫ్ లో ఆ సర్ప్రైజ్ ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కాలేదు.

సంబంధిత సమాచారం :