“అఖండ” బాలయ్యలోని ఆ షేడ్ అదరగొడుతుందట.!

Published on Jun 6, 2021 6:05 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ”. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంపై అధికారిక అప్డేట్స్ వచ్చే కన్నా ముందే పలు ఆసక్తికర అంశాలే వినిపిస్తున్నాయి.

అలా ఈ చిత్రంలో బాలయ్య చేస్తున్న ఓ రోల్ పై బజ్ వినిపిస్తుంది. ఇది వరకే బాలయ్య మరియు బోయపాటి చిత్రాల్లో వచ్చిన రెండు డిఫరెంట్ షేడ్స్ లో బాలయ్య కనిపించారు. అలాగే ఈ చిత్రంలో కూడా బాలయ్య రెండు గెటప్స్ కనిపిస్తున్నట్టు అర్ధం అవుతుంది. వాటిలో అఘోర రోల్ మరో లెవెల్లో ఉంటుందట.

అంతే కాకుండా ఆ రోల్ కు గాను స్పెషల్ గా డిజైన్ చేసిన కొన్ని డైలాగ్స్ కూడా బాలయ్య మార్క్ డైలాగ్ డెలివరీతో సూపర్బ్ గా ఉంటాయట. ఇప్పటికే టీజర్ లో బోయపాటి ఆ రోల్ ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో చూపించారు. మరి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఆ రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :