ఇప్పుడు మన ఇండియన్ సినిమా మార్కెట్ లోనే ప్రభాస్ ఒక మోస్ట్ వాంటెడ్ హీరో. తన మీద ఎంత పెట్టినా సరే మినిమం టాక్ వచ్చినా సరే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించగల రేంజ్ కి ఎదిగాడు. మరి అందుకు తగ్గట్టుగానే ఒక దాన్ని మించిన మరొకటి భారీ ప్రాజెక్ట్ ను టేక్ చేస్తూ సెన్సేషన్ ను నమోదు చేస్తున్నాడు.
అలా ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చెయ్యగలిగే పలువురు దర్శకులతో సినిమాలు అదిరిపోయే స్రిప్ట్స్ ను తన అండర్ లో ఉంచిన ప్రభాస్ మరో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ను కూడా హోల్డ్ లో పెట్టినట్టుగా మళ్ళీ టాక్ వినిపిస్తుంది. అతడే బాలీవుడ్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిద్దార్థ్ ఆనంద్.
ఇప్పటి వరకు ఇతడు చేసిన సినిమాలు అతని యాక్షన్ టేకింగ్ కు భారీ వసూళ్లే వచ్చాయి. మరి ఈ దర్శకుడు ప్రభాస్ తో ఓ సినిమా చేస్తాడని ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే అప్పుడు అది మరుగున పడినా ఇంకా వీరి కాంబోలో ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ లైన్ లో ఉన్నట్టు మళ్ళీ వినిపిస్తుంది. మరి నిజంగానే ఈ కాంబో నుంచి ఓ సినిమా ఉందో లేదో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.


