“ఆచార్య”లో ఆ సాంగ్ మరో చార్ట్ బస్టర్ అవుతుందట.!

Published on May 20, 2021 12:03 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రంలోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ ఆల్బమ్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు స్పెషల్ కారణం మణిశర్మ. చిరు మరియు మణిశర్మల కాంబో ఇప్పటి వరకు ఎన్నో సూపర్బ్ ఆల్బమ్స్ ఉన్నాయి. మరి వాటికి తగ్గట్టుగానే ఈ చిత్రంలో ఫస్ట్ సింగిల్ కు భారీ రెస్పాన్స్ మ్యూజిక్ లవర్స్ నుంచి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో మరో సాంగ్ పై బజ్ వినిపిస్తుంది.

అదే చరణ్ మరియు పూజా హెగ్డేలపై డిజైన్ చేసిన సాంగ్ కోసం. ఈ ఇద్దరి మధ్య వచ్చే సాంగ్ కూడా పెద్ద హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇది వరకే ఈ సాంగ్ లీక్ కాగా అది విన్నవారు కూడా బాగుందని కితాబిచ్చారు. మరి ఈ మరో చార్ట్ బస్టర్ సాంగ్ ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :