హాలీవుడ్ సినిమా తీయనున్న దక్షిణాది టాప్ డైరెక్టర్.?

హాలీవుడ్ సినిమా తీయనున్న దక్షిణాది టాప్ డైరెక్టర్.?

Published on Dec 1, 2020 3:04 PM IST

ఒక్కో సినీ ఇండస్ట్రీకి ఒక్కో బెంచ్ మార్క్ ఉంటుంది. అలా ఆయా ఇండస్ట్రీలు వాటి సామర్ధ్యాలను తగ్గ సినిమాలను తీసి ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే అది ఏ ఇండస్ట్రీ అయినా సరే పెట్టే డబ్బుని బట్టే క్వాలిటీ కూడా వస్తుంది. అందుకే ఆ విషయంలో హాలీవుడ్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. అందుకే హాలీవుడ్ లెవెల్లో అనే పోలికలు కూడా పుట్టాయి.

అయితే మన ఇండియన్ సినిమా నుంచి కూడా ఎన్నో మాస్టర్ పీస్ చిత్రాలు హాలీవుడ్ కు పోటీనిచ్చాయి. మరి అలాగే మన దర్శకులు సత్తా చాటి హాలీవుడ్ లెవెల్ సినిమాలు చేసారు. అలాంటి వారిలో మొదట శంకర్ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు మన తెలుగు నుంచి రాజమౌళి, కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే మన దక్షిణాదికి చెందిన ఒక టాప్ దర్శకుడే ఓ హాలీవుడ్ సినిమా చేస్తున్నారని టాక్.

ఆ దర్శకుడు మరెవరో కాదు తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా తెలిసిన దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్. అది కూడా ఆశామాషి నిర్మాణ సంస్థ కాదు “వాల్ట్ డిస్నీ” వారితో చేస్తున్నారని తెలుస్తుంది. అయితే డిస్నీ పిక్చర్స్ నుంచి వచ్చిన కొన్ని లైవ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఈ చిత్రాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారని కూడా వినికిడి. తమిళ నాట తనదైన సినిమాలతో ఆకట్టుకున్న మురుగ ఈసారి హాలీవుడ్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తున్న ఈ టాక్ లో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు