తనకి తానే మేకప్ మెన్ గా మారిన స్టార్ నటుడు.!

Published on Apr 18, 2021 1:00 pm IST

ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతూ వస్తున్నాయి. ఒకరికి సోకితే మళ్ళీ ఇంకొకరిని ముట్టుకోడానికి లేని దారుణ పరిస్థితులు గత ఏడాది చూసాం. మరి ఈసారి కూడా అంతే స్థాయిలో మళ్ళీ కోవిడ్ వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా మన టాలీవుడ్ లో ప్రభావం పెరుగుతూ వస్తుండగా జగ్గూభాయ్.. అదే సీనియర్ స్టార్ నటుడు జగ్గు భాయ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

కరోనాకి థాంక్స్ చెబుతూ దాన్ని మూలాన తనకి తానే మేకప్ మెన్ మారి తనకి మేకప్ వేసుకుంటున్నాని ఓ ఫొటోతో షేర్ చేశారు. అయితే ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అలరించిన జగ్గూ భాయ్ తర్వాత గ్యాప్ ఇచ్చి విలన్ గా ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత స్ట్రాంగ్ గా నిలిచిన సంగతి మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు జగపతి బాబు పలు ఆసక్తికర ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :