‘సర్కారు వారి’ షూట్ లో అడుగుపెట్టిన ఈ కీలక నటుడు?

Published on Sep 1, 2021 7:03 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ ఒక్క అప్డేట్ కూడా అభిమానులకి మంచి హై ఇచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే ఈ చిత్ర షూట్ హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ తో స్టార్ట్ కాగా మరో కీలక అప్డేట్ ఇప్పుడు తెలుస్తోంది.

ఈ షూట్ కి గాను ప్రముఖ నటుడు సముథిరఖని పాల్గొన్నారట. ఈ చిత్రంలో కీలక రోల్ చేస్తున్న ఈయన నిన్నటి నుంచి పాల్గొనట్టుగా సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ లో అల వైకుంఠపురములో చిత్రంతో ఆకట్టుకున్న ఈ వెర్సిటైల్ నటుడు ఈ సినిమాలో ఎలా కనిపిస్తారా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాలిడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :