రామ్ మాస్ చిత్రంలో ఈ స్టార్ నటుడు విలన్ గా.?

Published on Jun 3, 2021 10:00 am IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన “ఇస్మార్ట్ శంకర్” తర్వాత నుంచి మాస్ లో తనకి మరింత మాస్ ఫాలోయింగ్ పెరిగింది. అందుకే ఆ చిత్రం నుంచి మరిన్ని మాస్ లైనప్ తో రామ్ సిద్ధం అవుతున్నాడు. అలా చేసిన “రెడ్” కి డివైడ్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లే రాబట్టేసాడు. ఇక ఈ చిత్రం తర్వాత కోలీవుడ్ స్టార్ అండ్ పక్కా మాస్ దర్శకుడు ఎన్ లింగుసామి తో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యగా మరోమారు మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇంకా షూట్ మొదలు కాని ఈ చిత్రంలో రామ్ ని ఢీ కొట్టే విలన్ రోల్ పై బజ్ నడుస్తుంది. అలా లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రంలో అక్కడి స్టార్ నటుడు మాధవన్ విలన్ గా నటించనున్నట్టు సమాచారం. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇది వరకే మాధవన్ “సవ్యసాచి” మరియు “నిశ్శబ్దం” చిత్రాల్లో స్ట్రాంగ్ నెగిటివ్ రోల్స్ లో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :