“సర్కారు వారి పాట” లో ఈ విలక్షణ నటుడు మాత్రమే.!

Published on Jun 3, 2021 9:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. మూడు వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఉన్న సాలిడ్ విలన్ రోల్ కి గత కొన్ని రోజులుగా ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తున్నాయి.

అయితే ఈ రోల్ కి గాను యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా మరియు కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మరియు స్టైలిష్ విలన్ అరవింద స్వామి పేర్లు రేస్ లోకి వచ్చాయి. కానీ వీరిలో మాత్రం ఒకరే ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారట. అతడే అర్జున్ సార్జా.. మహేష్ కి విలన్ గా అతనే ఫిక్స్ అయ్యినట్టు మహేష్ సన్నిహిత సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :