పవన్ మాస్ చిత్రంలో నటునిగా ఈ స్టార్ దర్శకుడు.!

Published on Jun 10, 2021 11:59 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మరో క్రేజీ అండ్ మాస్ రీమేక్ చిత్రం అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు సెట్టయ్యాయి. అయితే ఇప్పటికే చాలా మేర షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయిన ఈ చిత్రంపై లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ దర్శకుడు వివి వినాయక్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారట.

అయితే ఈ టాక్ నిజమే అన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే వినాయక్ రోల్ పవన్ తో పాటు సాలిడ్ రోల్ చేస్తున్న రానాకు దగ్గరగా ఉండేదిలా కనిపిస్తుందట. మరి ఇప్పటికే వినాయక్ నటునిగా కూడా కొన్ని చిత్రాల్లో కనిపించి హీరోగా కూడా “శీనయ్య” అనే చిత్రంతో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి మాస్ చిత్రంలో ఎలాంటి రోల్ లో కనిపించనున్నారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :