మెగా పవర్ స్టార్ ను మెప్పించిన ఈ స్టార్ డైరెక్టర్..?

Published on Sep 27, 2020 9:03 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రెండు భారీ మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి దర్శక ధీరుడు రాజమౌళి తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో “రౌద్రం రణం రుధిరం” కాగా మరొకటి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న “ఆచార్య”.

ఇక ఈ రెండు చిత్రాలు అనంతరం చరణ్ ఎవరితో చేయనున్నాడు అన్న ప్రశ్న ఇంకా సస్పెన్స్ గా కొనసాగుతుంది. అయితే కొంత మంది స్టార్ దర్శకులు టచ్ లో ఉన్నారని గాసిప్స్ వినిపించాయి. అలాగే ఇప్పుడు మరో టాక్ వినిపిస్తుంది చరణ్ తో సినిమా చేసే రేస్ లో ఉన్న దర్శకుల్లో వంశీ పైడిపల్లి కూడా ఒకరు.

ఇపుడు ఈ డైరెక్టర్ చరణ్ ను తన స్క్రిప్ట్ తో మెప్పించినట్టు తెలుస్తుంది. మంచి యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దిన ఈ స్క్రిప్ట్ చరణ్ కు బాగా నచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే చరణ్ కు వెంకీ కుడుముల కూడా ఒక స్క్రిప్ట్ వినిపించి మెప్పించారని టాక్ తెలిసిందే. మరి చరణ్ ఏ దర్శకునితో సినిమా చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More