తెలుగు అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 మరికొన్ని రోజుల్లో పూర్తి కానున్న సంగతి తెలిసిందే. కానీ ఈ గ్రాండ్ ఫైనల్స్ కు ఎవరి చీఫ్ గెస్ట్ గా వస్తారు అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే మిగిలి ఉంది. అయితే గత సీజన్లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చి మరింత టీఆర్పీ ను అందించి సెన్సేషనల్ రికార్డులు సెట్ చేసారు.
మరి ఇంకా ఈసారి అంతకు మించిన రెస్పాన్సునే ఆడియెన్స్ కూడా ఆశిస్తున్నారు. కానీ ఇంకా గెస్ట్ ఎవరు అన్నదానిపై మాత్రం ఇంకా ఎలాంటి సమాచారము రాలేదని లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది. మొదటగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు లిస్ట్ లోకి వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈసారి కూడా ఫైనల్స్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీద గానే జరగనుంది అని సమాచారం. గత సీజన్లో ఒక్కో కంటెస్టెంట్ అన్ని విషయాలు చర్చించిన మెగాస్టార్ ఈసారి ఎలా అలరిస్తారో చూడాలి.


