“ఆదిపురుష్”లో ఈ స్టార్ హీరో ఎంత వరకు నిజం.?

Published on May 8, 2021 8:08 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆదిపురుష్”. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం రామాయణం ఆధారంగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని బయటకు వస్తున్నాయి.

దాదాపు చాలా మేర షూట్ ను ఇక్కడే హైదరాబాద్ లో మేకర్స్ ఆల్రెడీ ప్లాన్ చెయ్యడంతో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ టాక్ గత రెండు రోజుల నుంచి వినిపిస్తుంది. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో ఓ కీలక పాత్రలో నటించనున్నాడని తెలిసింది. అతడే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.

కిచ్చా ఈ చిత్రంలో విభీషణుని పాత్రలో కనిపించనున్నాడని మొన్నటి నుంచి టాక్ ఉంది. అయితే ఇందులో ఇంకా కన్ఫర్మేషన్ లేనట్టు తెలుస్తుంది. ఆ రోల్ సహా మరిన్ని ఇతర కీలక పాత్రలకు ఆల్రెడీ చర్చలు నడుస్తున్నాయని టాక్. మరి నిజంగానే కిచ్చా ఉన్నదా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :