ఈ రెండు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ స్టార్ హీరో.!

Published on May 12, 2021 7:03 am IST

ప్రస్తుతం మన ఇండియన్ సినిమా దగ్గర భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. ఇప్పటికే కొంత మేర షూట్ కంప్లీట్ అయిన ఈ చిత్రం ఇపుడు హైదరాబాద్ లో షూట్ జరుపుకోనుంది. అలాగే మరో భారీ చిత్రం శంకర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో ఉంది.

అయితే ఈ రెండు సినిమాలకు కామన్ గా కలుపుతూ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పేరు గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తుంది. రెండు చిత్రాల్లో కూడా కిచ్చా ఓ కీలక పాత్ర చేస్తున్నాడని టాక్ ఉంది. అయితే వీటిలో శంకర్ తో సినిమాకు కొంతమేర అధికారిక క్లారిటీ ఉంది కానీ ఆదిపురుష్ విషయంలో మాత్రం ఇంకా మిస్టరీ కొనసాగుతుంది. మరి వీటిలో ఏ చిత్రంలో సుదీప్ కనిపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :