ఎప్పుడూ లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి ప్రాజెక్టులను అతి తక్కువ కాలంలోనే లైన్ లో పెట్టేయడం ఇప్పుడు మనం చూసాము. అయితే ఆల్ మోస్ట్ పూర్తయిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” ను మినహాయిస్తే మిగతా అన్ని సినిమాలపై ఒక్కో దానిపై ఒక్కో రకమైన అంచనాలు నెలకొన్నాయి. వాటిలో రీసెంట్ గా అనౌన్స్ చేసిన చిత్రం “అయ్యప్పనం కోషియం” రీమేక ఒకటి.
ఇది అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా విపరీతమైన బజ్ నెలకొంది. ముఖ్యంగా పవన్ కు పోటీగా కనిపించే రోల్ పైనే ఎక్కువగా బజ్ వినిపిస్తుంది. అలా ఆ రోల్ కు గాను చాలా మంది అగ్ర హీరోల పేర్లే వినిపించగా ఇప్పుడు మరొక టాలెంటెడ్ స్టార్ హీరో పేరు వెలుగులోకి వచ్చింది.
అతడే తమిళ విలక్షణ నటుడు మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇప్పుడు మేకర్స్ అండర్ లో ఈ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ రోల్ విషయంలో పెద్ద సస్పెన్సే కొనసాగుతుంది. మరి మేకర్స్ ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


