బాలయ్య కోసం మళ్ళీ ఈ స్టార్ హీరోయిన్.?

Published on May 20, 2021 8:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీనుతో తమ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ “అఖండ” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ ఈ చిత్రం అనంతరం బాలయ్య సాలిడ్ లైనప్ ను కూడా ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగా టాలెంటెడ్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను ప్లాన్ చేశారు. మరి ఈ చిత్రానికి సంబంధించి మరో గాసిప్ ఇపుడు వినిపిస్తుంది. ఇది వరకే బాలయ్య “లయన్” సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్ త్రిష ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించనున్నట్టు నయా టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఆల్రెడీ ఈ చిత్రానికి కథ ప్రిపేర్ అయ్యిపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :