“పుష్ప” లో మరో స్టార్ హీరోయిన్ కూడానా..?

“పుష్ప” లో మరో స్టార్ హీరోయిన్ కూడానా..?

Published on Jan 6, 2021 9:00 AM IST

Pushpa

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరి ఇంకా అలాగే ఈ భారీ చిత్రంకు సంబంధించి మరిన్ని ఆసక్తికర వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి.

అలా ఇప్పుడు తాజాగా వచ్చిన టాక్ ప్రకారం ఓ స్టార్ హీరోయిన్ బన్నీకు సోదరి పాత్రలో కనిపించనుంది అని తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఈ చిత్రంలో బన్నీ రోల్ కు గాను సోదరి పాత్ర ఉంటుంది టాక్ వచ్చింది. మరి ఈ రోల్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి పోషించనుందట. మరి ఇది ఎంత వరకు నిజమో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు