తారక్ నెక్స్ట్ లో ఈమె ఫిక్సే అట.!

Published on May 15, 2021 5:07 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం సాలిడ్ లైనప్ ను కూడా తారక్ సెట్ చేసుకున్నాడు. అయితే రాజమౌళితో సినిమా చేసాక తారక్ కొరటాలతో సినిమా చెయ్యడం ఈ మధ్యనే కన్ఫర్మ్ అయ్యింది.

అలాగే రీసెంట్ గానే ఈ చిత్రం ఎం=ఫిమేల్ లీడ్ పై టాక్ కూడా వచ్చింది. ఈ చిత్రంలో తారక్ సరసన స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసింది. మరి లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం అది నిజమేనట. ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో కియారా నే ఫిక్స్ అయ్యిందని సినీ వర్గాల సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ వహిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :