హ్యాపీ మూమెంట్ : ట్విన్స్ కి జన్మనిచ్చిన రాహుల్ – చిన్మయి దంపతులు.!

Published on Jun 22, 2022 8:00 am IST

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రాహుల్ రవీంద్రన్ కోసం చాలా మందికి తెలిసిందే. “అందాల రాక్షసి” తో మంచి ఫేమ్ తెచ్చుకున్న తాను తర్వాత దర్శకునిగా రచయితగా పలు సినిమాలకి పని చేసారు. అయితే తాను తన భార్య ప్రముఖ సింగర్ సహా నటి అయినటువంటి చిన్మయి లు రీసెంట్ గానే అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ హిట్ చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.

మరి ఈ జంటకి ఇప్పుడు ట్విన్స్ పుట్టడంతో వారి ఇంట ఆనందం నెలకొంది. దీనితో ఈ హ్యాపీ మూమెంట్ ని రాహుల్ సోషల్ మీడియాలో పంచుకొని వారి పిల్లల పేర్లను కూడా అప్పుడే షేర్ చేసుకున్నాడు. దృప్త, శర్వాస్ లు మా కొత్త ఎప్పటికి నిలిచిపోయే విశ్వం లోకి వచ్చారని ఎంతో ఆనందంతో వారి చిట్టి చేతుల్లో తన చేతులు కలిపి ఆ ఫోటోలను తాను షేర్ చేసుకోగా ఇవి చూసి వారి ఫాలోవర్స్ మరియు సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :