పవన్ చేత సాయం ఇప్పిస్తానంటున్న స్టార్ ప్రొడ్యూసర్.!

Published on Aug 12, 2020 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాల పరంగా కంటే కూడా ఆయన్ను వ్యక్తిగంతంగా ఇష్టపడే అభిమానులే అత్యధికంగా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే పవన్ ఇప్పటికే ఎందరికో తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన సహాయాలు కూడా ఉన్నాయని ఆయనకు బాగా సన్నిహితులు చెప్తుంటారు. అలాంటి వారిలో పవన్ కు బాగా సన్నిహితుడు, స్టార్ ప్రొడ్యూసర్ వీటన్నిటినీ మించి అతనికి బిగ్గెస్ట్ ఫ్యాన్ బండ్ల గణేష్ కూడా ఒకరు.

అయితే ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రతీది మానిటర్ చేస్తున్నారు. అలా ఎంతోమంది ఆపదలో ఉంటే తాను తన వంతు సాయంతో పాటుగా పెద్దల దృష్టికి కూడా బండ్ల గణేష్ తీసుకెళ్తారు. అలా ఇప్పుడు తన కొడుకు ప్రాణాలు కాపాడుకోడం కోసం పవన్ సాయం కోరిన ఓ తల్లికి తాను పవన్ ను కలిసేలా చూస్తాను తనకి వారికి చెందిన వివరాలు తనకు చేరవేయమని ఆ ట్వీట్ పెట్టిన క్రౌడ్ ఫండింగ్ సంస్థ వారిని అడిగారు. దీనితో బండ్ల గణేష్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

సంబంధిత సమాచారం :

More