బన్నీ లైనప్ లో ఇంకా ఉన్న తమిళ్ స్టార్ డైరెక్టర్.!

Published on Jun 11, 2021 12:00 pm IST

తన లేటెస్ట్ అండ్ భారీ ప్రాజెక్ట్ “పుష్ప” తో పాన్ ఇండియన్ ఎంట్రీ ఇవ్వడానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నాడు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో బన్నీ పాన్ ఇండియన్ ఎంట్రీ పర్ఫెక్ట్ గా ఉంటుందని ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ చిత్రం అనంతరం బన్నీ చేసే ప్రాజెక్ట్స్ పై కూడా మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే బన్నీ లైనప్ లో ఎప్పటి నుంచో ఉన్న మోస్ట్ అవైటెడ్ కాంబో ఒకటి ఉంది. అదే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో.. వీరి కాంబోలో సినిమాపై ఎప్పుడో టాక్ బయటకి వచ్చింది. కానీ ఇప్పటికీ మొదలు ఎప్పుడు అన్నది తెలియలేదు. దీనితో ఈ ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయినట్టే అని అంతా అనుకున్నారు.

కానీ ఈ కాంబోలో సినిమా అయితే ఖచ్చితంగా ఉందట అలాగే ఈ చిత్రం బహుశా ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పుష్ప రెండు పార్ట్స్, “ఐకాన్” తర్వాత ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా మురుగదాస్ తో సినిమా ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :