మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత చేసిన తెలుగు సినిమానే మా ఇంటి బంగారం. ఇంత గ్యాప్ తర్వాత వచ్చినా కూడా ఈ సినిమా భారీ సక్సెస్ అయ్యి ఇప్పుడు 50 కోట్ల మార్క్ దిశగా వెళుతుంది. అయితే ఎవరూ ఈ రేంజ్ సక్సెస్ ని ఊహించి ఉండకపోవచ్చు కానీ సమంత తన స్టార్ పవర్ తో బాక్సాఫీస్ పుల్ చూపించింది.
అయితే ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ అవ్వడానికి కంటెంట్, సమంత స్టార్డంతో పాటుగా మరో ముఖ్య కారణం కూడా ఉందని సినీ సర్కిల్స్ లో ఇప్పుడు వినిపిస్తోంది. అదేమిటంటే సినిమాకి గల సాధారణ టికెట్ ధరలు అట. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధారణ టికెట్ ధరల తోనే విడుదల అయ్యింది.
సీన్ కట్ చేస్తే రెండు చోట్లా కూడా సాలిడ్ బుకింగ్స్ ఈ సినిమాకి కొనసాగుతున్నాయి. సో టికెట్ ధరలు అందుబాటులో పెడితే జనం థియేటర్స్ కి వస్తారని చెప్పడానికి ఈ సినిమా కూడా ఓ నిదర్శనం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సో ముందు రోజుల్లో ఈ స్ట్రాటజీని పెద్ద సినిమాలు కూడా ఫాలో అయితే బెటర్.


